
కలిగిరి, అక్టోబర్ 13, మన ధ్యాస ప్రతినిధి నాగరాజు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీని జనసేన అధిష్టానం ప్రకటించింది.జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు ప్రకటనలో తెలిపారు.ఈ కమిటీలో అసెంబ్లీ సమన్వయకర్తలుగా *భోగినేని కాశి రావు, గుండబత్తిన రామమూర్తి, నిమ్మలపల్లి రామ చైతన్య* లను నియమించారు.నిర్వాహక దళ్గా మొత్తం 32 మందిని నియమించగా, ఇందులో *కలిగిరి మండలం, పెద్దకొండూరు గ్రామానికి చెందిన గుంటగాని మహేష్ వర్మ* కు కూడా చోటు దక్కడం విశేషం. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మహేష్ వర్మకు ఈ పదవి రావడంతో కలిగిరి మండల జనసైనికులు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కమిటీ సభ్యులంతా కలిసి ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.