కరకంబాడి (రేణిగుంట):
రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామా నగర్లో గత కొంతకాలంగా వేధిస్తున్న విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది.
స్థానికంగా కరెంటు కోతలు, వోల్టేజ్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని క్లస్టర్ ఇంచార్జ్ బుజ్జి నాయుడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి తారకరామా నగర్‌కు నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించారు.
అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడంతో గ్రామంలో కరెంటు సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమైంది.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఏడి రమేష్ , ఏ ఈ పుణ్యకోటి , లైన్మెన్ శ్రీహరి పాల్గొని ట్రాన్స్ఫార్మర్ను అందుబాటులోకి తెచ్చారు.
సమస్య తెలిపిన వెంటనే స్పందించి విద్యుత్ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే గారికి, కృషి చేసిన క్లస్టర్ ఇంచార్జ్ బుజ్జి నాయుడు గారికి తారకరామా నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
