రేణిగుంట అక్టోబర్ 12.
రైల్వే రక్షణ దళం ( ఆర్పిఎఫ్ ) లో విశిష్ట సేవలు అందించిన గుంతకల్ డివిజన్, రేణిగుంట ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కె . రాజగోపాల రెడ్డి ప్రతిష్ఠాత్మకమైన "రాష్ట్రపతి పోలీస్ పతకం" (ప్రెసిడెంట్ మెడల్ ఫర్ డిస్టింగుషెడ్ సర్వీసెస్ ) అందుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన ఆర్పిఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో ఆయనకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. దశాబ్దాలుగా రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ మరియు అంకితభావంతో కూడిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం లభించింది.
అభినందనల వెల్లువ:
కె . రాజగోపాల రెడ్డి కి రాష్ట్రపతి పతకం లభించడం పట్ల గుంతకల్ డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఏ ఎస్ సి / జి టి ఎల్ , ఆర్పీఎఫ్ అధికారులు, ఇన్స్పెక్టర్లు మరియు ఆర్పీఎఫ్ సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ అధికారులు మాట్లాడుతూ — రాజగోపాల రెడ్డి నిబద్ధత, కర్తవ్య నిర్వహణ మరియు సేవా తత్పరతకు దక్కిన తగిన గౌరవం ఇది. ఆయన సాధించిన ఈ ఘనత గుంతకల్ డివిజన్ ఆర్పీఎఫ్ వర్గానికి ఎంతో గర్వకారణం. ఆయన ప్రస్థానం భావితరాల ఆర్పీఎఫ్ సిబ్బందికి నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది" అని కొనియాడారు.

