
స్థానిక పరిశుద్ధ యోహాను దేవాలయంలో నూతనంగా నిర్మించతలపెట్టిన మందిర నిర్మాణ పనుల నిమిత్తం బత్తల కుటుంబీకులు తమ ఉదారతను చాటుకున్నారు. అమరులు, కీర్తిశేషులు బత్తల జయరాజు మరియు కీర్తిశేషులు ఏఎస్పీ సారా సుశీలమ్మ పవిత్ర జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రూ. 3,00,000/- (మూడు లక్షల రూపాయలు) భారీ విరాళాన్ని ప్రకటించి సమర్పించారు.
దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కీర్తిశేషుల కుమారులు బత్తల ప్రతాప్ రాజ్ కుమార్, బత్తల ప్రదీప్ రాజ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. దేవాలయ దైవజనులు, పాస్టర్ రెవరెండ్ ఇమ్మాన్యుయేల్ బాబు సమక్షంలో నిర్మాణ కమిటీ ప్రతినిధులకు ఈ విరాళాన్ని అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ ఇమ్మాన్యుయేల్ బాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, వాక్య పరిచర్య చేశారు. దేవుని మందిర సమగ్ర నిర్మాణానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ముందుకొచ్చి అంత పెద్ద మొత్తంలో విరాళాన్ని అందించిన బత్తల కుటుంబ సభ్యులను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దైవ కార్యాల కోసం సత్కార్యాలు చేయడం ఎంతో ఆదర్శనీయమని, ఆ కుటుంబంపై దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... మందిర నిర్మాణంలో భాగస్వాములై ఉదార మనస్సుతో సహాయ సహకారాలు అందించిన బత్తల సోదరులను, వారి కుటుంబీకులను కొనియాడారు. వారి ఈ విరాళం నూతన దేవాలయ నిర్మాణ పనులకు ఎంతో ఊతాన్నిస్తుందని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బత్తల కుటుంబ సభ్యులతో పాటు దేవాలయ కమిటీ ప్రతినిధులు, సంఘ పెద్దలు, పలువురు విశ్వాసులు విశేష సంఖ్యలో
