మన న్యూస్ డిసెంబర్ 24:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నల్లమడుగు,గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం ఇంట్లో తన బావమరిది ఇంట్లో ఫంక్షన్ ఉండగా తేదీ 18.12.2024 నాడు వెళ్లగా ఇంటి లో ఎవ్వరు లేని సమయంలో రాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగల గొట్టి బీరువా లో నుండి వెండి బంగారు ఆభరణాలు మరియు నగదు ను దొంగలించగా లింగంపెట్దరఖాస్తు పోలిస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేయటం జరిగింది. నేర స్థలంలో లభించిన వేలి ముద్రాల ఆధారంగా నిందితుడు గాందారికి చెందిన ర్యాపని ఒడ్డె సాయిలు గా గుర్తించి నిందితుని ఈరోజు లింగంపేట్ బస్సు స్టాండ్ వద్ద పట్టుకుని నిందితుని వద్ద నుండి దొంగలించబడిన వెండి ఆభరణాలు స్వాధీనపర్చుకుని రిమాండ్ కు పంపామని లింగంపెట్ ఎస్సై సుధాకర్ తేలియజేశారు