డ్రగ్స్, గంజాయి మత్తుకు యువత దూరంగా ఉండాలి – ఎస్ఐ
ఐరాల సెప్టెంబర్ 10 మన ద్యాస (నాగరాజ సరకింటి)
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల పరిధిలోని చినకాంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఎస్ఐ నరసింహులు, కానిస్టేబుల్ సురేంద్రబాబు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామస్థులు ఎస్ఐ నరసింహులును శాలువాతో ఘనంగా సన్మానించి, పల్లె నిద్ర కార్యక్రమానికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎస్ఐ నరసింహులు మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు. మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలు, ఇతర సామాజిక అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఐరాల మండల సీనియర్ నాయకులు బి. పరదేశి, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.