మన న్యూస్తి:రుపతి,దైవభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారానే సాధ్యం కల్చరల్ ఆక్టివిటీస్ వేదికగా ఆధ్యాత్మిక నగరం కూచిపూడి, కథక్ ప్రదర్శన కనువిందు చేశాయి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు కళా రంగం నిలువుటద్దమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక శ్రీకృష్ణ నటరాజ ఆలయం కల్చరల్ డెవలప్మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రం వేదికగా జరిగిన రెండవ భారత కల్చరల్ డాన్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తికి, దైవభక్తికి, సనాతన ధర్మ పరిరక్షణకు కళా రంగం కృషి అనిర్వచనీయమన్నారు. శ్రీకృష్ణ నటరాజ ఆలయం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సాంస్కృతిక నృత్య ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక నగరం కళారంగానికి పెట్టింది పేరని, ఎంతోమంది కళాకారులు సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. నాట్య కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, కథక్ నృత్యం కనువిందు చేసిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కళారంగాన్ని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం నృత్య ప్రదర్శన గావించిన కళాకారులకు ఆయన చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు