
మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైన్స్, జియాలజీ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిగిరి టీడీపీ మండల అధ్యక్షుడు పూసల వెంగప నాయుడు విజయవాడలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రికి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఆయన సహకారంతో కలిగిరి మండలంలోని పలు అభివృద్ధి పనులు, ముందుకు సాగుతున్నాయని మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై మంత్రితో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా మండలంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని మంత్రిని కోరినట్లు తెలిసింది.మంత్రిని కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, దర్శి నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర, ఎపినాపి మాజీ సర్పంచ్ వరప్రసాద్, నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి కొల్లు రవీంద్ర సానుకూలంగా స్పందించి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.
