
కొండాపురం, అక్టోబర్ 04, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి చెందిన బీసీ ముద్దుబిడ్డ గుమ్మా శివకృష్ణ స్కూల్ కమిటీ చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా కొమ్మి గ్రామంలోని కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్, పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... శివకృష్ణకు వరుసగా రెండోసారి స్కూల్ కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. తనకు లభించిన పదవిని సద్వినియోగం చేసుకుని కొమ్మి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య, బూత్ ఇంచార్జ్ చెరుకూరి శేషయ్య, వెంకపనాయుడు, కొండలరావు తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
