మన న్యూస్:గొల్లప్రోలు రాజ్యసభ సభ్యుని గా ఎంపికైన సానా సతీష్ బాబును గొల్లప్రోలు పట్టణానికి చెందిన జనసేన నాయకుడు,మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు కలసి అభినందనలు తెలిపారు కాకినాడలోని కార్యాలయంలో సతీష్ బాబుకు కలిసి సాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు రాజ్యసభ సభ్యునిగా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు.అనంతరం తమ్మయ్య నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గోదావరి ప్రాంతం నుండి సతీష్ బాబు రాజ్యసభకు ఎంపిక కావడం ఉభయగోదావరి జిల్లాల ప్రజలు హర్షించదగ్గ విషయమని తెలిపారు.ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ సమస్యలను తమ్మయ్య నాయుడు సతీష్ బాబుకు వివరించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మొగలి రామ్మూర్తి,వెన్నా సత్యనారాయణ, కొసిరెడ్డి సూరిబాబు,గరగ తాతారావు తదితరులు పాల్గొన్నారు.