
*కావలి, అక్టోబర్ 02 మన న్యూస్ RC ఇన్చార్జి నాగరాజు
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కొండాపురం మండలం రెడ్ క్రాస్ కన్వీనర్ *తాటికొండ నవీన్* కావలి పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు ఉన్న మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం *57వ సారి రక్తదానం* చేశారు.ఈ సందర్భంగా కావలి రెడ్ క్రాస్ చైర్మన్ *రవిప్రకాష్* మాట్లాడుతూ - మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో యుద్ధ క్షతగాత్రులకు సేవ చేయడానికి స్వచ్ఛంద వైద్య దళాలను (యాంబులెన్స్ కార్ప్స్) ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ స్ఫూర్తితో నిస్వార్థ మానవతా సేవలను అందించారని, గాంధీ జయంతి రోజున 57వ సారి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. నవీన్ అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి లైఫ్ లైన్ ఫౌండేషన్ ద్వారా నాలుగు రాష్ట్రాలలో రక్తదాతలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.సామాజిక కార్యకర్త *మాలకొండారెడ్డి* మాట్లాడుతూ - అహింసనే ఆయుధంగా మలచి దేశ స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీజీ మానవాళికి సత్యం, శాంతి, మానవత్వం వంటి విలువలను బోధించిన మహనీయుడని, నవీన్ తాను రక్తదానం చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరమైన వారికి రక్తదానం చేయించి ప్రాణాలను కాపాడుతున్నారని అభినందించారు.లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నవీన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ వంటి మహనీయుల సేవలను, త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కావలి రెడ్ క్రాస్ చైర్మన్ రవిప్రకాష్, సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి, ఆరికట్ల మధుసూదనరావు, ఓరుగంటి వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.