
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 (మన ధ్యాస): నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రభుత్వం అందజేస్తున్న యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు కస్తూరిబా విద్యాలయ ప్రిన్సిపాల్ సరోజనతో టీచర్లు అందరూ కలిసి వినతిపత్రం అందజేశారు.కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న తమకు ప్రస్తుతం అందుతున్న వేతనాలు సరిపోవడం లేదని, వేతనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
ఉపాధ్యాయుల సమస్యను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సానుకూలంగా విన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీచర్లు సుమలత, సరిత కుమారి, సవిత, ప్రశాంతి, రజిత, రామాదేవి, శ్రీలత, సుజాత, సుమన్బాయి తదితరులు పాల్గొన్నారు.