
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 (మన ధ్యాస): నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ చేరుకోగా, కస్తూరిబా విద్యార్థినులు వారికి పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ప్రభుత్వం అందించిన షూస్, యూనిఫాం, బాక్సులు, ప్లేట్లను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందించడం ద్వారా వారి చదువుకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ సరోజన, టీచర్లు సుమలత, సరిత కుమారి, సవిత, ప్రశాంతి, రజిత, రామాదేవి, శ్రీలత, సుజాత, సుమన్‌బాయి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, మండల అధ్యక్షుడు ప్రజా పండరి ,తదితరులు పాల్గొన్నారు.
