

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం సెప్టెంబర్ 30 ::32వ వార్డు పరిధిలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.మెయిన్ రోడ్డు పూతీ వారి మాన్యం నుంచి ప్రారంభమై వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పూతీ వారి మాన్యం పరిసర ప్రాంతాల ప్రజలు తాగునీటి సరఫరా తక్కువ సమయం మాత్రమే జరుగుతోందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే సంబంధిత వాటర్ సి ఈ పల్లంరాజు సమస్యను తెలియజేసి,నీటి సరఫరాలో ఇబ్బందులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.అలాగే వార్డులోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు,తాగునీటి సరఫరా,విద్యుత్ తదితర సమస్యలను స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే చర్చించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని,సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం కృషి చేస్తున్నామని,రానున్న రోజుల్లోనూ దక్షిణ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు పనిచేస్తామని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు, సీనియర్ నాయకులు,వార్డు ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.