
కలిగిరి, సెప్టెంబర్ 27, మన న్యూస్ ప్రతినిధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం చైర్మన్ దామోదర్ నాయుడు ఆదివారం కలిగిరి ఎంపీడీఓ కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాజకీయ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వీవోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి వేదిక ఏర్పాట్లు, ప్రజల తరలింపు, పార్కింగ్, తాగునీరు, భద్రత తదితర అంశాలపై దామోదర్ నాయుడు ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ వివిధ పదవుల లో ఉన్న నాయకులు పాల్గొన్నారు