
తవణంపల్లి సెప్టెంబర్ 26 మన ద్యాస(నాగరాజ సరకింటి)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ హోమ కార్యక్రమాన్ని వేద పండితులు మంత్రోచ్ఛారణలు, పూర్ణాహుతుల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఏ. రఘుపతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి హోమంలో పాల్గొన్నారు. వారితో పాటు ఆలయ ఈవో ఈ. మునిశేఖర్, పాలకమండలి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహంతో భక్తులందరికీ ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సుదర్శన హోమాన్ని నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. హోమ కార్యక్రమం పూర్తయిన అనంతరం హోమంలో పాల్గొన్న భక్తులకు, ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ అధికారులు శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుదర్శన హోమంలో పాల్గొనడం వల్ల సకల గ్రహదోషాలు, దుష్ట శక్తులు తొలగిపోయి శుభం కలుగుతుందని అర్చకులు తెలిపారు. పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.సాయంత్రం 7 గంటలకుప్రాకారోత్సవం నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తుల ఆధ్యాత్మిక ఆసక్తిని పెంపొందించేలా కాలక్షేప కొ కార్యక్రమాల్లో భాగంగా హరికథతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో, ఆలయ చైర్మన్ ఏ. రఘుపతి, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
