
మన ధ్యాస,మక్తల్: కోర్ట్ అడ్వకేట్ అడ్ హక్ కమిటి అధ్యక్షుడు గా డి తిమ్మన అడ్వకేట్ ఎంపిక అయ్యారు. శని వారం మక్తల్ పట్టణం కోర్టు భవనం లో బార్ అసోసియేషన్ హాడ్ హక్ కమిటి అధ్యక్షుడు ఎంపిక నిర్వహించారు. ఎలక్షన్లో 36 మంది అడ్వకేట్లు పాల్గొనగా డి తిమ్మన్న అడ్వకేట్ అధ్యక్షునిగా ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా తిమ్మన్న ను శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమం లో అడ్వకేట్ లు రాజేశ్వర్ గౌడ్, కాళేశ్వర్, నర్సింలు సురేందర్, సూర్య ప్రకాశ్, దత్తాత్రేయ, ఆనంద్, రవి కుమార్ గౌడ్, భరత్, ఆనంద్ సునీత, రాజశేఖర్, వెంకటేష్ గౌడ్, రఘు నందన్ గౌడ్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.