మన న్యూస్:తుర్కెంజల్భా రత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాల గోడపత్రిక ను ఈ రోజు తుర్కా యాంజల్ చౌరస్తాలో జిల్లా కౌన్సిల్ సభ్యులు పి శివకుమార్ గౌడ్ అధ్యక్షతన విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య మాట్లాడుతూ సిపిఐ1926 డిసెంబర్ 26 న ఆవిర్బవించి అనేక పోరాటాలు చేసిందన్నారు. భారత స్వాతంత్రోద్యమం లో పాల్గొని ఎంతో మంది ప్రాణ త్యాగలు చేసి దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటాలు చేసిందని అన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో భూమి కోసం,భుక్తి కోసం అనే నినాదం తో గెరిళ్ల దలాన్ని నడిపి 4000 మంది ప్రాణ త్యాగం చేసిన ఘనత సిపిఐ పార్టీది అని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో సిపిఐ ఎక్కడా రాజీపడకుండా రాష్ట్ర ఏర్పాటు కచ్చితంగా జరగాలని నిరంతరం పోరాటం చేసిందని అన్నారు. సాధించుకున్న తెలంగాణ లో ప్రజల సమస్య ల పరిష్కారం కోసం సిపిఐ నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. ఈ తరుణం లోనే సిపిఐ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ప్రజలందరికి ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పల్లపు శివకుమార్, పిల్లి కృష్ణ, బ్రహ్మయ్య, శ్రీను గౌడ్, చెక్క యాదగిరి, కొట్య నాయక్, భాస్కర్, శ్రీను, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్,గండికోట శివ, వివేక్ తదితరులు పాల్గొన్నారు.