
మన ధ్యాస ప్రతినిధి గాజువాక సెప్టెంబర్ 25:తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తో 76 వార్డ్(96) తెలుగుదేశం సీనియర్ నాయకులు పీత వెంకటరమణ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పీతల వెంకటరమణ మాట్లాడుతూ గాజువాక పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి వచ్చే జీవీఎంసీ ఎలక్షన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా టికెట్ ఇప్పించవలసిందిగా అధ్యక్షుల వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1982 నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పుడు నుండి ఈరోజు వరకు పార్టీకి అనేక సేవలు అందిస్తూ అనేక కార్యక్రమంలో పాల్గొని వార్డు అభివృద్ధి కోసం,నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో సేవలందిస్తూ 44 సం|| నుండి టిడిపి జెండా మోస్తూ సేవలు అందిస్తున్నాను కాబట్టి పార్టీ పెద్దలు అందరు కూడా నాయొక్క సర్వీస్ ని దృష్టిలో పెట్టుకొని నా వార్డుకి కార్పొరేట్ అభ్యర్థిగా టికెట్ ఇప్పించవలసిందిగా కోరడమైనదని తెలిపారు.