
మన ధ్యాస, మక్తల్ :తిరుమలలో ఈనెల 21, 22 తేదీలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మఖ్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు మాతురి, బంజార నృత్యాలతో అలరించారు. ఫైన్ ఆర్ట్స్ కల్చర్ అకాడమీ, శ్రీ స్వస్తిక్ ఆర్ట్స్ అకాడమీ రమేష్ మాస్టర్, ఆద్య నృత్య కళార్పణ అకాడమీ నాట్యాచారిణి హారతి గోపాలాచార్య శిష్య బృందంతో కలిసి వీరు ఈ ప్రదర్శనలిచ్చారు.ఈ కార్యక్రమంలో రాజేశ్వరితో పాటు విద్యార్థినిలు ఇందుప్రియ, మేఘన, కావేరి, నందిని, భవాని, పవిత్ర, శ్రావణి, నవనీత, జయశ్రీ ఉత్సాహంగా పాల్గొని తిరుమల శ్రీవారిని నాట్య నీరాజనంతో సేవించుకున్నారు.