మనన్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సైబర్ మోసగాళ్లు చేసే మోసాలు గురించి వివరిస్తూ మొదటగా మనకు ఫోన్ చేసి మీ మీద ఒక పార్సెల్ వేరే దేశంకు బుక్ అయ్యింది అందులో డ్రగ్స్ వున్నాయి అందుకు సంబందించిన ఎవిడెన్స్ మా దగ్గర వున్నాయి. మీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అని చెబుతారు. మీకు లాటరీ తగిలింది అని చెప్పి లింక్ ను క్లిక్ చేసి యూపీఐ పిన్ పెట్టండి డబ్బులు వస్తాయి అంటారు యూపీఐ పిన్ పెట్టగానే మన అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తారు. మీ మీద అరెస్ట్ వారెంట్ వుంది అని ఫేక్ డాకుమెంట్స్ ను పంపుతారు. సైబర్ నేరగాళ్ళు నేరుగా వీడియో కాల్ చేసి నిజమైనా పోలీసులు లాగా నమ్మేలా చేస్తారు. తరువాత మ్మిమల్ని కేసు నుండి తప్పించాలంటే మేము చెప్పిన అకౌంట్ నెంబర్ కి డబ్బులు వేయమంటారు.తరవాత ఆన్లైన్ మార్కెటింగ్ లో మోసాలు, ఎటిఎం కార్డుల స్కిమ్మింగ్ లలో ఆన్లైన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ. ఆన్లైన్ షాపింగ్ చేయడంలో జరిగే మోసాలు. ఆన్లైన్ ట్రేడింగ్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అని మభ్యపెడుతారు. అనవసరంగా సైబర్ మోసగాళ్లు చేసే కాల్ కి గురిఅయి డబ్బులను పోగొట్టుకోవద్దు. ఒక వేళ మీరు మోసపోయారని ఏ మాత్రం అనుమానం వచ్చిన, మీ దగ్గరలో వున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి పిర్యాదు చెయ్యండి. లేదా టోల్ ఫ్రీ 1930 నంబర్ కి కాల్ చెయ్యండి.అని శ్రీకాళహస్తి కౌన్సిలర్ చిగురుపాటి కిరణ్ శ్రీకాళహస్తి మండలం ఎగువ వీధి గ్రామం లోని ప్రజలకు సూచించారు .ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు, నాయకులు పాల్గొన్నారు.