
మన ధ్యాస,మక్తల్ : పట్టణంలోని సంగంబండ రోడ్ లో ఉన్న శ్రీ వైష్ణవి బాలికల జూనియర్ కాలేజీ లో శనివారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణేశుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విద్యార్థినిలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆ తర్వాత జరిగిన లడ్డూ వేలంపాటలో ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ లడ్డూ దక్కించుకున్నారు. అనంతరం విద్యార్థినిలు గణపతి బొప్పా మోరియా అంటూ ఉత్సాహంగా చెరువు కట్ట వద్ద నిమజ్జనం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ డాక్టర్ శ్రీరామ్, కరస్పాండెంట్ నాగరాజు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.