మన న్యూస్:బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శ్రీ సోమనాధేశ్వర వజ్ర లింగ దర్శనం దివ్య స్వర్ణిమ రథం సోమవారం గొల్లప్రోలు చేరుకుంది. గత 5 సంవత్సరాల నుండి 5 రాష్ట్రాలలోని సుమారు 6వేల గ్రామాలలో పర్యటిస్తూ గొల్లప్రోలు చేరుకున్న దివ్య స్వర్ణిమ రథానికి భక్తులు భక్తి, శ్రద్ధలతో స్వాగతం పలికారు. పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలలో భక్తులు సోమనాధేశ్వర వజ్ర లింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ కేంద్రం గొల్లప్రోలు శాఖ ఇన్ ఛార్జ్ చంద్రకళ అక్కయ్య మాట్లాడుతూ పరమాత్ముని దివ్య అవతరణ, కర్తవ్యములు అందరికీ తెలియజేయాలన్న శుభసంకల్పంతోనే రథయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. గీతా జ్ఞానము, సహజ రాజయోగ శిక్షణ ద్వారా నైతిక విలువలు పెంపొందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రహ్మకుమారీలు,శివ భక్తులు పాల్గొన్నారు.