
కలిగిరి, సెప్టెంబర్ 19 , మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను కలిగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు.
కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగపనాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మండలంలోని రావులకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
*నిత్యావసర సరుకులు, దుస్తుల పంపిణీ...*
జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రావులకొల్లు ఎస్టీ కాలనీలోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. పేదలకు అండగా నిలవడమే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆశయమని, ఆయన స్ఫూర్తితోనే ఈ సేవా కార్యక్రమాలు చేపట్టామని మండల అధ్యక్షులు పూసాల వెంగపనాయుడు తెలిపారు.
*రోగులకు పండ్ల పంపిణీ...*
అలాగే కలిగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి పండ్లు పంపిణీ చేశారు. రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కూటమి నాయకులు, రావులకొల్లు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
