మనన్యూస్:వెదురుకుప్ఫం మండలంలోని వైసిపి రాష్ట్ర కార్యదర్శి పేట ధనంజేయులరెడ్డి సతీమణి నల్లవెంగన పల్లి యం.పీ. టీ. సీ సభ్యురాలు సుజాత ల పదవులకు మనస్తాపం తో రాజీనామా చేయాలన్న నిర్ణయం పార్టీ పెద్దలు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , జిల్లా ముఖ్యనేత యం.సీ.విజయ నంద రెడ్డి,యువనేత భూమన అభినయ్ రెడ్డి లు రంగ ప్రవేశం చేసి స్థానిక యం.పీ. టీ.సీ తో మరియు వైసిపి రాష్ట్ర కార్యదర్శి తో చర్చించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించారు. ఈ సందర్భంగా వై సి పి రాష్ట్ర కార్యదర్శి పేట.ధనంజేయులు రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,నాయకులు విజయానందరెడ్డి,భూమన అభినయ్ రెడ్డి లతో పాటు నావెంట పార్టీ ఆవిర్భావానికి ముందునుంచి దివంగత మహానేత కుటుంబం కోసం నేటివరకు నాతో నడిచిన ఆత్మీయులందరి కోరిక మేరకు పార్టీ కి ,పదవులకు రాజీనామా నిర్ణయం విర మించుకుంటున్నమని పాత్రికేయులకు తెలిపారు. పార్టీ పైన నాయకులకు,కార్యకర్తలకు ప్రాణం ఉన్నదని నియోజక ఇన్చార్జి లుగా ఉన్నవారు ప్రతి గ్రామంలో,పంచాయితీ లో,మండలంలో,నియోజక వర్గ పర్యతనలప్పుడు మరియు మిగిలిన సమయాల్లో నేరుగా కూడగట్టుకొని పోయే అలవాటు చేసుకుని వెళ్ళినప్పుడే పార్టీ బలపడుతుందని,కార్యకర్తలకు భరోసా, మాజీ ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.ఈ సందర్భంగా తన కు,కుటుంబానికి అండగా నిలిచిన నాయకులకు,కార్యకర్తలకు,ఆత్మీయులకు కృతజ్ఞతలు తెలిపారు.