
కలిగిరి, సెప్టెంబర్ 17 , మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
భారతదేశ ప్రధానమంత్రి, ప్రపంచ నేత నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు గురువారం కలిగిరి లో కొవ్వొత్తు ల తో ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా జీవితంలో ఆయనకు 25 ఎల్ల రాజకీయ ప్రయాణంలో ఆయన ముఖ్యమంత్రి గా ప్రధాన మంత్రి గా ఆయన సేవలందించడం చాలా సంతోషం గా ఉంటుందని ఆయన అన్నారు. అంతే కాకుండా సామాన్య కుటుంబంలో జన్మించి, అంచెలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన మోదీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా దేశానికి అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారని, ఆయన హయాంలో భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణ రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలిచిందని తెలిపారు."సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్" అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని, పేదలకు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన వంటి పథకాలు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ప్రధాని మోదీ ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు.ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశానికి మరెన్నో సంవత్సరాలు తన సేవలను అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.మోదీ సేవా నిరతిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పూసాల వెంగప నాయుడు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, బీజేపీ జనసేనా కూటమి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
