
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత పిలుపు.
మన ధ్యాస,మక్తల్: నియోజకవర్గ కేంద్రంలో మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో ఏర్పాటైన సెట్విన్ సాంకేతిక శిక్షణా సంస్థ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత సూచించారు. మంగళవారం సెట్విన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆమె, కేంద్రంలో టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, కంప్యూటర్ ట్రైనింగ్ లలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులను అడిగి శిక్షణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వాకిటి లలిత మాట్లాడుతూ,సీఎం రేవంత్ రెడ్డి, స్పోర్ట్స్ యూత్ సర్వీసెస్ శాఖ మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో తన శాఖలోనే అనుబంధంగా ఉన్న సెట్విన్ కేంద్రాన్ని మక్తల్ కు తీసుకువచ్చారని తెలిపారు. మక్తల్ ప్రాంత మహిళలు స్వయం ఉపాధితో తమకాళ్లపై తాము నిలబడాలని, నారాయణపేట, గద్వాల, వనపర్తి లాంటి జిల్లా కేంద్రాల్లో సైతం లేని సెట్విన్ ను... మక్తల్ లో ఏర్పాటు చేశారంటే ఈ ప్రాంతంపై మంత్రి వాకిటి శ్రీహరికి ఉన్న ప్రత్యేక అభిమానమని అన్నారు. త్వరలోనే సెట్విన్ కింద మరిన్ని విభాగాలకు సైతం శిక్షణను విస్తరించే యోచనలో మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, స్థానిక వార్డు కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య నీల గౌడ్, వార్డు కౌన్సిలర్ రహీం పటేల్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, నాయకులు చంద్రకాంత్ గౌడ్, అమర్, గోవిందరావు, నీలప్ప ముదిరాజ్, సెట్విన్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, ట్రైనర్లు తిమ్మప్ప, స్వప్న, వీరమ్మ, ఫర్హానా, సిబ్బంది ప్రవీణ్, లక్ష్మీ, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.