తిరుపతి సెప్టెంబర్ 11.
తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు ను తిరుపతిలోని వారి కార్యాలయంలో ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సత్కరించి బుద్ద భగవాన్ చిత్ర పటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టార్ కృష్ణ మాట్లాడుతూ దళిత బహుజన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. అందుకు ఆర్. ఎం. శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈ .వాసు, కె. అంజప్ప, టి. కె. స్వామి మరియు మాజీ డి. ఎం. జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
