
పెద్ద గంట్యాడ మండలం సెప్టెంబర్ 10వ తారీకు:75 వ వార్డు మొల్లివాని పాలెం గ్రామంలో40 సం||శ్రీ మురళీకృష్ణ యాదవ్ సేవా సంఘం గ్రామ పెద్దలు,యువజనసంఘం అధ్యక్షులు ఉరుకూటి శ్రీనివాస యాదవ్,ఉపాధ్యక్షులు ఉరుకూటి శ్రీను ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిడిపి సీనియర్ నాయకులు పెంటకోట శంకర్రావు,వైయస్సార్సీపి జిల్లా యూత్ అధ్యక్షులు ఉరుకూటి చందు,సెలెస్టా మాల్ గేమింగ్ జోన్ అధినేత బొడ్డు అరుణ్ కుమార్,శ్రీ పెంటమాంబ ఆలయ కమిటీ డైరెక్టర్లు,చేతుల మీదగా గొప్ప అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. తదనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 40 సం|| గ్రామ పెద్దలు అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారని.శ్రీకృష్ణుని జనవృత్తాంతంలో సత్యానికి తప్ప మరి దేనికి తావు లేదని భక్తులకు సత్యం వైపు నడిచే విధంగా భక్తులకు మంచి మార్గం నడవడిక నడిచిన ఏకైక వ్యక్తి అని ఈ సందర్భంగా కొనియాడారు.యువజన సంఘం అధ్యక్షులు ఉరుకూటి శ్రీనివాస్ యాదవ్,ఉపాధ్యక్షులు ఉరుకూటి శ్రీను ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణుడు భక్తులను కాపాడటానికి గోవర్ధనగిరి ఎత్తి ఏడు రాత్రులు ఏడు పగలను చిటికెన వేలపైన ఉంచి పశుపక్షాదులను కాపాడిన భగవంతుడని తెలిపారు.గత40సం||గ్రామస్తుల సహకారంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ముఖ్య అతిధుల చేతుల మీదగా అన్న సమారాధన ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి కూడా ఆ భగవంతుని ప్రసాదం అందే విధంగా భక్తిశ్రద్ధలతో గ్రామ పెద్దలు యువత పెద్ద ఎత్తున పాల్గొని సేవా కార్యక్రమం చేయడం జరిగింది.కోశాధికారి మల్లి చిన్నరమణ,కార్యదర్శి నమ్మి చందర్రావు మాట్లాడుతూ ఈనెల 12వ తారీఖున శ్రీకృష్ణుని ప్రతిరూపాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిమజ్జనం కార్యక్రమం చేయడం జరుగుతుందని.ఈ కార్యక్రమంలో సామూహిక కార్యక్రమాలలో భాగంగా గ్రామంలో శ్రీకృష్ణుని ప్రతి రూపాన్ని ఊరోగింపు తో పాటు,బాణా సంచాలతో, కోలాటం,గరిడి,కాళీమాత రూపం అలంకరణతో కూడిన నృత్యం ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా గ్రామస్తులు పెద్దలు,యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం తెలియజేశారు.