
కావలి సెప్టెంబర్ 10 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.
నెల్లూరు జిల్లా కావలి మండలం బుడంగుంట ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల, బుడమగుంట నందు వెంగళరావు నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నుండి ఎన్.వి.బి.డి.సి. పి (ఎం.పీ.హెచ్.ఏ(M) జి రమణయ్య మరియు ఆశావర్కర్ షేక్ హబిబున్నిసా ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులుకు ఆరోగ్యం మరియు పరిసరాల పరిశుభ్రత గురించి మరియు దోమల ద్వారా, నీటి ద్వారా వచ్చు వ్యాధులు గురించి, ఫ్రై డే - డ్రై డే గురించి ఉదాహరణ పూర్వకముగా వివరించి పిల్లలుకు చక్కని అవగాహనా కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జొన్నలగడ్డ రామారావు మరియు సహా ఉపాధ్యాయుడు గాదిరెడ్డి మురళీకృష్ణ, పాఠశాల ఆయా గుమ్మడి రాజేశ్వరి మరియు పాఠశాల కుక్ కమ్ హెల్పర్ గుమ్మడి లక్ష్మమ్మ మరియు పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
