
మన ధ్యాస, మక్తల్: మండల పరిధిలోని కర్నీ గ్రామంలో బుధవారం సీసీ రోడ్డు పనులను సర్పంచ్ రాధా దత్తురం ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ రాధా మాట్లాడుతూ, ఎస్సి ఎస్ టి సాబ్ ప్లాన్ 20 లక్షల నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ పనుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. సి సి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో కాలనీవాసులు శేఖర్ సర్పంచ్ రాదను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, వార్డ్ మెంబర్లు గాసం అనిత, చక్రధర్, మహబూబ్ పాషా, గసం శ్రీను, బలమొల్ల నరసింహా, గాసం నరసింహ,తదితరులు పాల్గొన్నారు.