
వెంకటాచలం, సెప్టెంబర్ 07 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మానసపుత్రికగా 25 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు, స్వర్ణభారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత, భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ అనగాని సత్య కుమార్ యాదవ్,శాసనసభ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కెవీపీ రామచంద్రరావు, కామినేని శ్రీనివాసులు, బొల్లినేని కిష్టయ్య తదితర ప్రముఖులతో కలిసి టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నారు.స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్లుగా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన,గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు. సమాజ సేవకు అంకితమైన స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు బొల్లినేని వెంకట రామారావు తెలిపారు.
