
మాన ధ్యాస,మక్తల్: పట్టణంలోని ఎస్వీకేఆర్ అక్షయ రెడ్డి పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు బోధన అందించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాల లోని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ని శాలువా కప్పి సత్కరించి జ్ణాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శిరీష, కరస్పాండెంట్ రమేష్ శెట్టి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.