తవణంపల్లి డిసెంబరు 22 మన న్యూస్
తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాస్ నారాయణద్రి కళ్యాణమండపం నందు తవణంపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 91-92 సంవత్సరములో పదవతరగతి చదువుకున్న 90 మంది విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రామానాయుడు, నాగరాజ పిళ్లై, నళిని గురువులను మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారికి బహుమతి అందజేశారు. అనంతరం గురువుల పాదాలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అందరూ కలిసి భోజనం చేశారు. అనంతరం ఆరోజు పాఠశాలలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకొని పరిచయాలతో అలింగణం చేసుకున్నారు. పాఠశాలలో కలిసిమెలిసి చదువుకున్న రోజులను తీపి జ్ఞాపకాలను కష్టసుఖాలను ఆనందభాష్పాలతో గుర్తుచేసుకొని ఒకరితో ఒకరు వారి కుటుంబాల గురించి చర్చించుకున్నారు. అనంతరం గ్రూప్ ఫోటో తీయించుకున్నారు పాఠశాలకు గుర్తుగా విలువైన ఎలక్ట్రికల్ బెల్ ను బహుమతిగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.