మన న్యూస్:తిరుపతి జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం స్థానిక జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశంలో బి సి ఈఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు టి గోపాల్, ప్రధాన కార్యదర్శి బట్టా భాస్కర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని బీసీ ఉద్యోగుల హక్కుల గురించి చర్చించారు. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారులు సుమారు 3000 మంది ఉన్నారని వారందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో బీసీఈఎఫ్ కమిటీలు వేసి బీసీ ఉద్యోగుల సమస్యల పైన పోరాటం చేయాలని, జిల్లాలోని బీసీ ఉద్యోగ అధికారుల సమన్వయం కోసం సమర్థులైన అర్హత కలిగిన బిసి అధికారులను ముఖ్య స్థానాల్లో నియమించాలని తెలిపారు. బీసీ అధికారులకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా వారు ప్రజాసేవలో అంకితం అవడానికి బీసీఈఎఫ్ సహకరిస్తుందని తెలియజేశారు. బిసి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ కోసం ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి చాలా మండలాల్లో అవగాహన లేకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వివరించారు. ఈ విషయమై జిల్లా అధికారులకు, మండల స్థాయి అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని బీసీఈఎఫ్ రాష్ట్ర నాయకులు గోపాల్ చెప్పారు. ఈ సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక ప్రముఖులు వీర కిరణ్, ముఖ్య సలహాదారులు పెద్దపాలెం పాపయ్య, ఎస్ దేవరాజు, బీసీ ఉద్యోగుల సంఘం ముఖ్య నాయకులు జి. ప్రసాద్, బాలసుబ్రమణ్యం, వాసు దేవయ్య, రామ్మోహన్,విజయ్ కుమార్, నాగరాజు, బెన్నీ లాప్స్ అధినేత అగరం వినోద్ పాల్గొన్నారు.అనంతరం తిరుపతి జిల్లా బీసీఈఎఫ్ కమిటీ ఎన్నిక, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బట్ట భాస్కర్ అధ్యక్షతన జరిగింది. తిరుపతి జిల్లా బిసి ఈ ఎఫ్ జిల్లా కమిటీ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా గణేష్ బాబు (విద్యాశాఖ తిరుపతి రూరల్), గౌరవాధ్యక్షులుగా సురేష్ బాబు( పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రధాన కార్యదర్శిగా వంకీ పురం పవన్ తిరుమల టిటిడి కోశాధికారిగా సునీల్ దత్ సహకార శాఖ జిల్లా ఉపాధ్యక్షులుగా కె.బాల సుబ్రహ్మణ్యం {కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎస్సీ మెడికల్ కాలేజ్ తిరుపతి ), మధుసూదన్ (జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్) ఏపీఎస్పీడీసీఎల్, వాసు దేవయ్య (విద్యాశాఖ),రామ్మోహన్
(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కందాడ ఏర్పేడు మండల్),శ్రావణ్ కుమార్ హెల్త్ సూపర్వైజర్, మహిళ కార్యదర్శిగా నాగలక్ష్మి(చెర్లోపల్లి ఉన్నత పాఠశాల ), మహిళా అదనపు కార్యదర్శులుగా లత(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేపగుంట), సునీత(నర్సింగ్ సూపరింటెండెంట్ స్విమ్స్ తిరుపతి ) వనజ(హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ చంద్రగిరి), జిల్లా కార్యదర్శులుగా శ్రీ గోగుల్ మోహన్, అగరం వినోద్, విజయ్ కుమార్, శేఖర్, దశరథయ్య తదితరులు బీసీ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.