రేణిగుంట (సెప్టెంబర్ 4): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రేణిగుంట బస్టాండ్ ఆవరణలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి పూల వెంకటాద్రి యాదవ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ పరిసరాల్లోని దాదాపు 200 మందికి పైగా భక్తులకు, ప్రయాణికులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు మానవసేవే మాధవసేవ అనే ఆశయంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పలు పార్టీల ముఖ్య నాయకులు పాల్గొని పూల వెంకటాద్రి యాదవ్ చేపట్టిన సేవా దృక్పథాన్ని అభినందించారు. ఇందులో బిజెపి టౌన్ ప్రెసిడెంట్ నరేష్ రాయల్, ఎం.జి. రాజేష్, రావణలతో పాటు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్ రెడ్డి, వంశీ, చందు, మాధవరెడ్డి, రమేష్ మరియు ఇతర నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

