
శాంతిపురం, సెప్టెంబర్ 2 మన ద్యాస
శాంతిపురం మండలంలోని శెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్) ద్వారా నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ వి. జయప్రకాష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా చదువుకు దూరమైన వారిని గుర్తించి, వారికి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశం కల్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.అర్హులైన విద్యార్థులకు ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించే అవకాశం కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.