
గుడిపల్లి, సెప్టెంబర్ 2 మన ద్యాస
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ వి. జయప్రకాష్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన యువతీ యువకులకు ఏపీ ఓపెన్ స్కూల్ విద్యా అవకాశాలపై అవగాహన కల్పించి, అర్హులైన వారిని అడ్మిషన్లలో నమోదు చేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.