
మన ధ్యాస, మక్తల్: మండలం చిట్యాల వాగు నుంచి మక్తల్ పట్టణానికి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మక్తల్ పోలీసులు పట్టుకున్నారు.యాదవ్ నగర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా, ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించకపోవడంతో రెండు ట్రాక్టర్లను మక్తల్ పోలీస్ స్టేషన్కు తరలించి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ పి. రాజు మాట్లాడుతూ,అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలించినా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పట్టుబడిన ట్రాక్టర్ల వివరాలు:1. TS 31 B 6181 – చిట్యాలకు చెందిన మంగలి నరసింహులు.2. TG 38 8939 – బుక్క మాలన్ పాషా. గా పేర్కొన్నారు.