రేణిగుంట (తిరుపతి జిల్లా):
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను రేణిగుంట పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించినట్లు అర్బన్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. రేణిగుంట మండలం కరకంబాడి గ్రామానికి చెందిన మునిశేఖర్ అనే వ్యక్తి ఇటీవల తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్‌ను ట్రేస్ చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఫోన్ ఎక్కడుందో గుర్తించి, దానిని భద్రంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో బాధితుడు మునిశేఖర్‌ను పిలిపించి ఫోన్‌ను తిరిగి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ... పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వేగంగా రికవరీ చేయడంలో సీఐఆర్ పోర్టల్ ఎంతో పటిష్టంగా పనిచేస్తోందని చెప్పారు. ఎవరైనా తమ ఫోన్‌ను పోగొట్టుకుంటే కంగారు పడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి, సీఈఐఆర్ పోర్టల్ సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. పోగొట్టుకున్న ప్రతి ఫోన్‌ను ట్రేస్ చేసి బాధితులకు అందజేయడమే లక్ష్యంగా రేణిగుంట పోలీసులు పనిచేస్తున్నారని ఎస్ఐ శ్రీనివాసులు పేర్కొన్నారు.
