
చిత్తూరు , సెప్టెంబర్ 1 – మన ద్యాస (నాగరాజ సరకింటి)
చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్ మండలం వైస్సార్ప పార్టీ నాయకులు పచ్చనపల్లి గ్రామ సర్పంచ్ వి. పాండియన్ మంగళవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పాండియన్ వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆత్మీయంగా మాట్లాడారు. జిల్లాలో ప్రజలకు సంబంధించిన అంశాలు, స్థానిక పరిస్థితులు, ప్రజాసేవకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు తెలిపారు.వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పాండియన్ పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకత్వం తమకు మరింత ఉత్సాహాన్ని, ప్రజాసేవ పట్ల బాధ్యతను కలిగిస్తుందని అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని పాండియన్ తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు.