
మన ద్యాస, నెల్లూరు ఆగస్టు 30 : నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్లో ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రూప్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..........నమ్మిన నాయకులను, కార్యకర్తలను గాలికి వదిలేసిన అనిల్.. వేమిరెడ్డిపై ఆరోపణలు చేయడం విడ్డూరం ఎదవ చేశారు. రెండేళ్ల 4 నెలలుగా రాష్ట్రంలో లేక, పార్టీని పట్టించుకోకుండా అనిల్ కాలం గడిపారు అని అన్నారు. అధికారంలో సంపాదించిన కోట్లతో ఇతర రాష్ట్రాల్లో కాపురం పెట్టారని డిప్యూటీ మేయర్ ధ్వజం ఎత్తారు.చిన్నప్పుడు చదువుకున్న ఆల్చిగాడు కథలా అనిల్ అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు అని తెలిపారు. క్వార్ట్జ్, తెల్లరాయి, వేమిరెడ్డి గురించి మాట్లాడటం తప్ప అనిల్ ఏమీ చేయడం లేదు అని అన్నారు.నియోజకవర్గం లేక, రాత్రులు నిద్రపట్టక పిచ్చిపట్టి అనిల్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని తెలిపారు. వైఎస్ఆర్సిపి కార్యక్రమాలు, వైయస్సార్ జయంతి/వర్ధంతికి పిలవకపోవడమే అనిల్ దౌర్భాగ్యం అని ఎదవ చేశారు.ప్రజల్లో నాయకుడిగా గుర్తుండాలనే ఆరాటంతోనే అనిల్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అన్నారు.నెల్లూరు, రాష్ట్ర రాజకీయాల్లో వేమిరెడ్డి స్థాయి ఎక్కడ? అనిల్ స్థాయి ఎక్కడ? అని ప్రశ్నించారు.రాజకీయాల్లోకి రాకముందే సొంత డబ్బుతో వేమిరెడ్డి అనేక ధార్మిక, సంక్షేమ సేవలు చేశారు అని తెలిపారు.అధికారంతో కోట్లు సంపాదించి, సీటు పోగానే రాష్ట్రం వదిలిన అనిల్ స్థాయి ప్రజలకు తెలుసు అని అన్నారు.2 ఫేజ్‌లలో 1,000 కోట్లతో పెట్టాలనుకున్న క్వార్ట్జ్ వ్యాపారం నుంచి వేమిరెడ్డి ఏడాది క్రితమే తప్పుకున్నారు అని తెలిపారు.అనవసర ఆరోపణల దృష్ట్యా క్వార్ట్జ్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు వేమిరెడ్డి గతంలోనే చెప్పారు అని తెలిపారు.అయ్యప్ప మాల వేసి అవినీతి చేయలేదు అన్న అనిల్‌ను ఆ అయ్యప్ప స్వామే చూసుకున్నాడు అని అన్నారు.మాట ఇస్తే నిలబడే వ్యక్తి వేమిరెడ్డి.. మాట తప్పే నైజం ఆయనది కాదు అని అన్నారు. క్వార్ట్జ్ మైన్ ఓనర్లను వేమిరెడ్డి 8,000 - 10,000 అడిగారనడం పచ్చి అబద్ధం అని అన్నారు.వేమిరెడ్డి టన్నుకు 8 వేల నుండి 15 వేలు వసూ ళ్ళు చేస్తున్నారని ఒక్క మైన్ ఓనర్ చేత చెప్పించినా దేనికైనా సిద్ధం అని రూప్ కుమార్ యాదవ్ ఛాలెంజ్ వేశారు.రాజకీయ పుట్టుక నుంచి నేటి వరకు అనిల్ చరిత్ర తెలుసు, మాట్లాడితే సంస్కారం అడ్డొస్తోంది అని అన్నారు.జగన్ దగ్గరకు వెళ్లి వెంకటగిరి, రాపూరు సీట్లు అడిగినా పంపించేశారని వెల్లడి అని అన్నారు.పోటీ చేస్తానో లేదో, రాజకీయంలో లేకపోయినా పర్వాలేదని అనిల్ స్వయంగా చెప్పుకున్నాడు అని తెలిపారు.వేమిరెడ్డి పేరు ఉచ్ఛరించే అర్హత అనిల్‌కు లేదు.. అహంకారంతో కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోయాడు అని అన్నారు. సైదాపురం మైన్ ఓనర్లు వచ్చి కలవడానికి అనిల్ ఎవరు? అధికారా? మాజీ ఎమ్మెల్యేనా? అని ప్రశ్నించారు.వేమిరెడ్డిపై మాట్లాడి హీరో అవుదామనుకుంటున్న అనిల్.. ఇప్పటికే జీరో అయ్యాడు అని తెలిపారు.అనిల్ కుమార్ భవిష్యత్తు ఏంటో కాలమే నిర్ణయిస్తుంది, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు అని తెలియజేశారు.
