
కొండాపురం, ఆగస్టు 30, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం గ్రామంలో టిడిపి క్లస్టర్ ఇన్చార్జ్ పోలినేని రమేష్, వెంకటరత్తమ్మ దంపతుల కుమారుడు రవి కిషోర్ గంధపు నలుగు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై నూతన వరుడిని ఘనంగా ఆశీర్వదించారు. ఈ వేడుకలో నాయకుల రాకతో స్థానికంగా సందడి నెలకొంది.