మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 8 వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాలయలో పని చేసి గత నెలలో పదవి విరమణ పొందిన ప్రిన్సిపాల్ సత్యవతి ,గతంలో విద్యాలయంలో హిస్టరీ లెక్చరర్ విధులు నిర్వహించినా బాలాజీ అతిథులుగా కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సంవత్సరం పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలి అనే ఆలోచనతో,విద్యాలయంలో 3 లక్షల వ్యయంతో స్వయం సహకారంతో ఏర్పాటు చేసిన
ఈ పార్క్ లో జాతీయ చిహ్నం,పలు జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు,తో పాటు చుట్టూ పార్కుల ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.విద్యార్థుల యొక్క సౌకర్యార్థం 3 లక్షల రూపాయలతో, రెండు హాట్ వాటర్ గీజర్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ సంవత్సరం కార్యక్రమంలో 32 బ్యాచ్‌ల నుండి సుమారు 600 విద్యార్థులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.పూర్వ విద్యార్థుల నృత్యాలతో ఎంతో ఉషారుగా ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎర్రోళ్ల వినయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కోశాధికారి రేణుకా కుమారి ఉపాధ్యక్షులు బాశెట్టి నాగవేందర్,కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ విజయరాజ్, నవీన్ కుమార్, రాజబాబు, విక్రమ్, నరహరి చంద్రకాంత్, ప్రవీణ్, నరేష్ కుమార్, అమరేందర్ గంగమోహన్, శోభ, రేఖ, సరిత, అనిత ,తదితరులు ఉన్నారు.