
మన ధ్యాస ,నిజాంసాగర్, ఆగస్టు 23: కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పెద్దనాన్న కుమారుడు ఏలే ప్రవీణ్ కుమార్ ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం ప్రవీణ్ కుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మృతికి ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రజాపండరి,సీనియర్ నాయకులు రామ్‌రెడ్డి, ఎన్ఆర్ఐ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు