ఏర్పేడు ఆగష్టు 23.
ఏర్పేడు మండలం, పాపానాయుడు పేటలో ద్రౌపతి సమేత ధర్మరాజుల తిరునాళ్ళు అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు మరియు అంబేడ్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ ద్రౌపది ధర్మరాజుల వారి దర్శనార్థం ధర్మరాజుల గుడికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు కృష్ణప్ప మొదలి, అర్జున్ బాబు తదితరులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూలమాలలు వేసి, కండువాతో ఘనంగా సత్కరించి స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.ఆలయ పూజారి శాస్రోక్తకంగా పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల దయతో ప్రజలందరూ చల్లగా ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. అంతకు మునుపు స్టార్ కృష్ణ ఎం.ఎస్.బాబు ని స్టార్ కృష్ణ ఇంటివద్ద ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వడివేలు, తంగవేలు, జగన్ తదితరులు పాల్గొన్నారు

