ఉద్యోగుల ఆరోగ్య భద్రతే లక్ష్యం.. ఈ హెచ్ ఎఫ్ సేవలపై ప్రత్యేక పరిశీలన!
తిరుపతి ఆగష్టు 23.
టీటీడీ ఉద్యోగులకు ఈ హెచ్ ఎఫ్ లో అందుబాటులో ఉన్న అమరా హాస్పిటల్‌ను అమరా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ ఆహ్వానం మేరకు ఈ రోజు టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్శించింది. ఈ సందర్భంగా అమరా హాస్పిటల్లో టీటీడీ ఉద్యోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్సా సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికత, మౌలిక వసతులు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను అసోసియేషన్ ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్పిటల్‌లోని వివిధ విభాగాలను సందర్శించిన సందర్భంగా అక్కడ అందుబాటులో ఉన్న అన్ని వైద్య సదుపాయాలు, సౌకర్యాలు, ఆధునిక టెక్నాలజీ, చికిత్సా విధానాలు, టీటీడీ ఉద్యోగులకు ఈ హెచ్ ఎఫ్ ద్వారా అందుతున్న సేవలను అమరా హాస్పిటల్ సీఈఓ భాగ్యలక్ష్మి , ఏవో వేణుగోపాల్ , పవన్ అసోసియేషన్ ప్రతినిధులకు వివరించారు. వైద్య సేవలకు సంబంధించిన అంశాలను స్వయంగా పరిశీలించిన అనంతరం, టీటీడీ ఉద్యోగులకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా కొన్ని విలువైన సలహాలు, సూచనలను తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ హాస్పిటల్ యాజమాన్యానికి అందించారు. ఈ సందర్భంగా చీర్ల కిరణ్ మాట్లాడుతూ..
“ఉద్యోగి ఆరోగ్యమే కుటుంబానికి, సంస్థకు బలం. ఈ హెచ్ ఎఫ్ ద్వారా ఉద్యోగులకు అందుతున్న వైద్య సేవలు మరింత మెరుగుపడాలి. అత్యాధునిక వైద్య సదుపాయాలు, నాణ్యమైన చికిత్స, వేగవంతమైన సేవలు ఉద్యోగులకు అందేలా నిరంతరం పరిశీలించడం, అవసరమైన సూచనలు ఇవ్వడం మా అసోసియేషన్ బాధ్యత” అని పేర్కొన్నారు. అమరా హాస్పిటల్లో ఉన్న ఆధునిక వైద్య సాంకేతికత, సదుపాయాలు, ఉద్యోగులకు అందుతున్న సేవలపై అసోసియేషన్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య ప్రయోజనాల కోసం హాస్పిటల్ యాజమాన్యంతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ గంట భరత్, ప్రధాన కార్యదర్శి వంకీపురం పవన్, కోశాధికారి గుంటూరు రేఖ, ఈశ్వర్ నాయక్, రమాదేవి, హర్ష తదితరులు పాల్గొన్నారు.

