
కొండాపురం, ఆగస్టు 18, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.

కొండాపురం మండలంలో కోడే వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ నిత్యం నిరుపేదలకు అండగా నిలుస్తుంది అంటున్న కోడే వెంకట్రావు చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మెన్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు.
వివిధ వ్యాధులతో బాధపడుతూ పేదలు ఇబ్బంది పడుతున్న తరుణంలో కోడే వెంకట్రావ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి ఆర్థిక సహాయం అందించడానికి ట్రస్ట్ చైర్మన్ చెరుకూరు వెంకటాద్రి నాయుడు నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేస్తున్నారు.
కొండాపురం మండల టిడిపి పార్టీ మాజీ అధ్యక్షులు,కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, చెరుకూరి వెంకటాద్రి నాయుడు..
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో 210,211 బూత్ పరిధిలో భూత్ ఇంచార్జ్ లు చెరుకూరి శేషయ్య, బండ్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ మాజీ అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రినాయుడు,అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారన్నారు. అదేవిధంగా పంచాయతీలోని ప్రతిటీడీపీ కార్యకర్త కష్టపడి పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపునకు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి కార్యకర్తలు జడ పోలయ్య, జడ దిలీప్ ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.మండలంలో వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు మరియు చదువుకునే స్తోమత లేని నిరుపేద విద్యార్థులకు ట్రస్టుద్వారా సహాయం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య, మాజీ సర్పంచి గుంటూరు యేనా,టిడిపి నాయకులు,చెరుకూరి వెంకపనాయుడు,అంబటి సుబ్బారావు, జయమూర్తి తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
