
మన ధ్యాస, వెంకటాచలం ఆగస్టు 16 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో పర్యటించిన సందర్భంగా మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతితోపాటు , ఆయన కొడుకు, అల్లుడు కలసి సర్వేపల్లి లో సర్వం దోపిడీకి, సోమిరెడ్డి కుటుంబం పూనుకుంది అని అన్నారు.ఈ సందర్బంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...సర్వేపల్లి నియోజకవర్గం లో ఇప్పటికే కోట్లాది రూపాయలు విలువైన గ్రావిల్, మట్టి, ఇసుక, క్వార్ట్జ్, సోమిరెడ్డి కొడుకు అక్రమంగా తరలిస్తున్నాడని, సోమిరెడ్డి అల్లుడు మాత్రం లేఅవుట్ వేయాలంటే ఎకరాకు మూడు లక్షలు చెల్లించాల్సిందేనని షరత్ విధించి, జులై ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రేట్లు పెంచినట్లుగా సోమిరెడ్డి అల్లుడు, మూడు లక్షలకు ఒక లక్ష పెంచి, తనకు నాలుగు లక్షల రూపాయలు ఎకరాకు చెల్లించాల్సిందేనని ముక్కు పిండి లేఔట్ వ్యాపారుల దగ్గర వసూలు చేయడం చూసి సర్వేపల్లి ప్రజలు నిర్వేరపోతున్నారని తెలిపారు.చంద్రమోహన్ రెడ్డి మాత్రం ఇరిగేషన్ లో దొంగ బిల్లులు చేసుకుంటూ, అధికారుల బదిలీలకు సంబంధించిన సొమ్మును కాజేస్తూ, తన ఇష్టారీతిన తాను వ్యవహరిస్తున్నాడు, సోమిరెడ్డి కుటుంబం మొత్తం సర్వేపల్లి ను దోపిడీని చేస్తున్న తీరును చూసి సర్వేపల్లి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు.చంద్రమోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే, నీతి, నిజాయితీ ఉంటే, తాను తన కుటుంబం ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని, కాణిపాక వినాయకుడు దగ్గర ప్రమాణం చేయమని పదిసార్లు సవాల్ విసిరినా సరే తోక ముడుచుకుని వెళ్ళిపోతున్నాడని ఎద్దేవా చేశాడు.సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి, రైతులకు సాఫీగా సాగునీరు అందించకుండానే, రైతుల పేరిట వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్ లో దొంగ బిల్లులు చేసుకుని, సోమిరెడ్డి ప్రజా సొమ్ము ను దోచుకుంటున్నాడు, సోమిరెడ్డి కొడుకు విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ కందలపాడు లాంటి గ్రామాలు సైతం కన్నీరు పెట్టే విధంగా గ్రామాలకు, గ్రామాలే,దోచుకుంటూ నిలువెత్తు గుంతలతో కందలపాడు, నాగం బొట్ల వారి కండ్రిగ, రామదాసు కండ్రిగ, వెంకటాచలం, కనుపూరు తదితర గ్రామ ప్రజలకు కన్నీరు మిగిల్చారని మండిపడ్డారు. సూరాయిపాలెం, విరువూరు ఇసుక రిచ్ లను కొల్లగొడుతూ , ప్రైవేట్ స్కానర్లతో దోపిడీ చేసే ప్రయత్నం జరుగుతుంది, వీటన్నిటితోపాటు చంద్రమోహన్ రెడ్డి అల్లుడు మాత్రం ఎక్కడ లేఅవుట్ వేయాలన్న మూడు లక్షల రూపాయలు తీసుకునే వాడని,జూలై 1వ తేదీ నుండి లక్ష రూపాయలు పెంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని కాకాణి మండిపడ్డాడు.అధికారుల బదిలీలు, గోవధ సంతల ఏర్పాటుకు ప్రతి నెలా రూ. 10 లక్షలు వసూలు చేస్తూ సోమిరెడ్డి కార్యాలయ ఖర్చుల కోసం ఇవ్వాల్సిందేనని బెదిరించి మరీ వసూలు చేస్తున్నాడు, ఇవి కాక పారిశ్రామికవేత్తల నుంచి బెదిరింపులకు పాల్పడడం, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి సిఎస్ఆర్ నిధుల పేరుతో కలెక్టర్ మరియు ప్రభుత్వ జోక్యం లేకుండా, ఇష్టారీతిగా, తనకు సంబంధించిన కంపెనీలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తానంటూ కోట్లాది రూపాయలు సీఎస్ఆర్ నిధులు కూడా సోమిరెడ్డి దోచుకోవడమనేది దురదృష్టకరమైన విషయమన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నీతిగా, నిజాయితీగా పనిచేసి పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇచ్చామని కాకాణి స్పష్టం చేశారు.సర్వేపల్లిలో చంద్రబాబు గోటిలో చిలుకగా మారిన విజిలెన్స్ శాఖ కాకుండా సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని తాను సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని,ఇప్పటికే తనపై మోపబడిన కేసుల పై సీబీఐ విచారణ జరపాలని హైకోర్ట్ ను ఆశ్రయించినా నిజం బయటపడుతుందని ప్రభుత్వం సీబీఐ విచారణకు అడ్డు చెపుతుందని కాకాణి తెలిపారు.తాను దమ్మున్న మనిషిని కాబట్టే తనపై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టుని కోరానని,సోమిరెడ్డి కుటుంబం లాగా తీవ్ర అవినీతికి పాల్పడుతూ,దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు వేసే నీచ మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు.సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి, అవినీతి విషయాలపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు, కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని, సవాల్ విసిరినా సోమిరెడ్డి పత్తా లేకుండా పారిపోతున్నాడు, సోమిరెడ్డి ఇకనైనా కల్లబొల్లి మాటలు మాని, తప్పుడు కూతలు ఆపివేసి, నీతిగా నిజాయితీగా, తాను అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అని మరొకసారి సవాల్ విసిరాడు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా జంగాలపల్లి గ్రామానికి చెందిన నాగయ్య కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం వెంకటాచలంలో జిలాని భాష భౌతికకాయానికి నివాళులర్పించారు.


