కురకాల్వ సర్వేనెంబర్ 172.173. 174 లో పద్మా నగర్ వాసులకు ఇంటి స్థలాలు కేటాయించాలి - మురళి డిమాండ్.
పేదలు, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి — సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి.
రేణిగుంట ఆగష్టు 15. రేణిగుంట మండలంలోని పేదలు, నిరుపేదలు, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సహాయం, మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేణిగుంట మండలంలోని కాలనీలను సందర్శించిన ఆయన, అక్కడ ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, కుర్రకాలువలోని సర్వే నంబర్లు 171, 172, 174 జగనన్న కాలనీలో ఖాళీగా ఉన్న 150 ప్లాట్లను పద్మానగర్లోని అర్హులైన నిరుపేదలకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తారకరామ నగర్ నివాసితులకు పట్టాలు ఇవ్వాలని, రేణిగుంట పంచాయతీ కార్మికులకు ప్రత్యేకంగా 'కార్మికుల కాలనీ' ఏర్పాటు చేయాలని కోరారు.
మండలంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని మురళి సూచించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు సర్వే జరిపి స్వాధీనం చేసుకోవాలని, రక్షించిన భూములను పేదలకు కేటాయించాలని, లేనిపక్షంలో భూపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి వై.ఎస్. మణి, నాయకులు వెంకటరమణ, సెల్వ, సుబ్బరాజు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు

